Saturday, January 18, 2025
Homeసినిమాచిరు, బాల‌య్య పోటీ సంక్రాంతికి ఉందా?

చిరు, బాల‌య్య పోటీ సంక్రాంతికి ఉందా?

చిరంజీవి, నంద‌మూరి  బాల‌కృష్ణ‌.. వీరిద్ద‌రి సినిమాలు ఈ ద‌స‌రాకి కానీ.. సంక్రాంతికి కానీ.. పోటీప‌డ‌క త‌ప్ప‌ద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో ఇటు మెగాభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు  ఈ పోటీ కోసం,  ఏ సినిమా ఈ పోటీలో గెలుస్తుందనే విషయమై  ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్‘ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న వ‌స్తుంది. బాల‌య్య, మ‌లినేని గోపీచంద్ కాంబోలో రూపొందుతోన్న మూవీ కూడా ద‌స‌రాకి రిలీజ్ చేయాలనుకున్నా  షూటింగ్ అనుకున్న విధంగా కంప్లీట్ కాక‌పోవ‌డంతో బ‌రి నుంచి సంక్రాంతి రేసులో నిలిచింది.

చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ప‌క్కా మాస్ మూవీ ‘వాల్తేరు వీర‌య్య‌’ ను  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా అనౌన్స్ చేశారు. ఇక బాల‌య్య మూవీ కూడా సంక్రాంతికి వ‌స్తుంద‌ని టాక్ వినిపిస్తుంది కాబ‌ట్టి ద‌స‌రాకి త‌ప్పిన పోటీ సంక్రాంతికి మాత్రం తప్పదని అనుకుంటున్నారు, అయితే ఈ రెండు సినిమాలు నిర్మిస్తున్నదీ మైత్రి మూవీ మేకర్స్ కావడం గమనార్హం.  ఒకే సంస్థ తమ రెండు సినిమాల మధ్య పోటీ పెట్టుకోదు కాబ‌ట్టి సంక్రాంతికి కూడా చిరు, బాల‌య్య మ‌ధ్య పోటీ ఉండ‌దంటున్నారు. మ‌రి.. సంక్రాంతికి ఏం జ‌ర‌గనుందో చూడాలి.

Also Read: గాడ్ ఫాద‌ర్ పై ఫైర‌వుతున్న ఫ్యాన్స్..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్