Sunday, January 19, 2025
Homeసినిమాచిరంజీవి ‘భోళా శంకర్’ టైటిల్ పోస్ట‌ర్‌ రిలీజ్ చేసిన మ‌హేష్‌ బాబు

చిరంజీవి ‘భోళా శంకర్’ టైటిల్ పోస్ట‌ర్‌ రిలీజ్ చేసిన మ‌హేష్‌ బాబు

మెగాస్టార్ చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగా యుఫోరియాను అనౌన్స్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్రామిస్ చేశారు. చెప్పిన‌ట్లే ఈ స్పెష‌ల్ డే రోజున ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డం విశేషం. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు విడుద‌ల చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ విడుద‌ల చేయ‌డమ‌నేది మంచి ప‌రిణామమే కాదు.. ఇండ‌స్ట్రీకి సానుకూల సంకేతాన్ని ఇచ్చిన‌ట్ల‌య్యింది.

“హ్యాపీ బ‌ర్త్ డే చిరంజీవి గారు. నా స్నేహితుడు మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో, నా ఫేవ‌రేట్ ప్రొడ్యూస‌ర్ అనీల్ సుంక‌ర్ నిర్మాత‌గా రూపొందనున్న మీ ‘భోళా శంక‌ర్’ టైటిల్‌ను విడుద‌ల చేయ‌డమ‌నేది గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాల‌తో విజ‌యాల‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సర్‌” అంటూ మ‌హేష్‌ ట్వీట్ చేశారు.

చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో అనీల్ సుంక‌ర త‌న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అసోషియేష‌న్‌తో నిర్మిస్తోన్న `భోళా శంక‌ర్‌` మూవీ.. మెగా యుఫోరియాను క్రియేట్ చేస్తుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు. `భోళా శంక‌ర్` టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబుకు చిత్ర‌యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్