Sunday, January 19, 2025
Homeసినిమా‘చోరుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన ధనుష్

‘చోరుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన ధనుష్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత జి. డిల్లీబాబు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై ‘చోరుడు’ అనే కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  జివి ప్రకాష్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ‘చోరుడు’ అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా. పివి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీని కూడా అందిస్తున్నారు. పివి శంకర్, రమేష్ అయ్యప్పన్‌ కలసి కథ & స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే రాజేష్ కన్నాతో కలిసి ఇద్దరూ డైలాగ్స్ రాశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం రస్టిక్ గెటప్‌లో కనిపిస్తుంది. ఓ భారీ ఏనుగు పాదం పై నిలబడి వున్న ప్రధాన తారాగణం, బ్యాక్‌డ్రాప్‌లోని చెట్లు చూస్తుంటే.. కథ అటవీ నేపథ్యంలో సెట్ చేయబడిందని తెలియజేస్తోంది. ఏనుగు పాదం కింద వున్న రూపాయి కాయిన్ కూడా ఫస్ట్ లుక్ లో గమనించవచ్చు. 2023 వేసవిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ధీనా, జి. జ్ఞానసంబందం, వినోద్ మున్నా, ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మేకర్స్ ట్రైలర్, ఆడియో, సినిమా విడుదల తేదిలని తెలియజేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్