కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్ది, నిరుద్యోగ ఉధ్యమానికి మద్దతు ఇవ్వాలని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖిలపక్ష నేతలను కోరారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన దీక్షపై గాంధీభవన్లో అఖిలపక్ష భేటీ నిర్వహించారు, అనంతరం భట్టి మాట్లాడుతూ నిరుద్యోగ పోరాటంలో కలిసి పనిచేద్దామని తమతో కలసివచ్చే పార్టీలను కోరామని వెల్లడించారు. మీటింగ్ లో పాల్గొన్న అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయని చెప్పారు. పోడు భూములు, ఇతర సమస్యల పై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నారన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో పాటు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తాయని భట్టి వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతు కోరే విషయమై పార్టీలో చర్చించి మరోసారి అన్నిపార్టీల నేతలతో సమావేశమవుతామని భట్టి చెప్పారు.
కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తో పాటు.. పోడు భూముల సమస్య పై పోరాటం ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యల పై కాంగ్రెస్ తో కలసి పోరాటం చేస్తామని, ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగ భ్రుతి ఇవ్వడంలో కేసీఆర్ విఫలం అయ్యారాని ఆరోపించారు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలసి పనిచేసినట్లు గానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.