ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని, దీనిలో భాగంగానే తాము అధికారంలోకి వచ్చిన తరువాత 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వీటిలో 22 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. జి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్నిఉద్దేశించి సిఎం జగన్ ప్రసంగించారు.
విశాఖలో గడిపిన సమయం మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానని G20 ప్రతినిధులతో సిఎం వ్యాఖ్యానించారు. తాము నిర్మిస్తున్న ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందని, దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని జగన్ కోరారు. ఇళ్ళకు మౌలిక సదుపాయాలపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని, దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు. దీనిపై మంచి ఆలోచనలు కావాలని విజ్ఞప్తి చేశారు.