Friday, July 5, 2024
HomeTrending Newsకోవిడ్ మందుల్లో మార్పులు చేయాలి: సిఎం

కోవిడ్ మందుల్లో మార్పులు చేయాలి: సిఎం

CM Review on Covid: కోవిడ్‌ వైరస్ మూడో దశలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో మందుల విషయంలో చేయాల్సిన మార్పులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో  కోవిడ్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్పలక్షణాలు ఉంటున్నాయన్న విషయాన్ని అధికారులు సిఎంకు వివరించారు.

స్వల్ప లక్షణాల మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలని, వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలని సిఎం ఆదేశించారు. చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి వివరించారు.

సిఎం సూచనలు
⦿ 104 కాల్‌ సెంటర్‌ను పటిష్టంగా ఉంచాలి
⦿ ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలి
⦿ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలి
⦿ నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలి
⦿ కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి
⦿ భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ లు కచ్చితంగా ధరించేలా చూడాలి
⦿ మాస్క్‌ లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలి
⦿ దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలి
⦿ బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్