Saturday, November 23, 2024
HomeTrending Newsసిఎంను అబ్బుర పరచిన బెండిపూడి విద్యార్థులు

సిఎంను అబ్బుర పరచిన బెండిపూడి విద్యార్థులు

Wonderful moment: ఆంగ్లంలో అద్భుతంగా రాణిస్తోన్న కాకినాడ జిల్లా బెండిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధినీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  నేడు కలుసుకున్నారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా సిఎం వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిద్వారా   ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు మంచి ప్రతిభ చూపుతున్నారు.  బెండిపూడి విద్యార్థుల ప్రతిభ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఈ విషయం తెలుసుకున్న సిఎం జగన్ వారిని నేడు స్వయంగా తన కార్యాలయానికి ఆహ్వానించారు. వారు ఆంగ్లంలో మాటాడిన తీరుకు సిఎం ముచ్చట పడ్డారు.

సిఎం జగన్ ను తొలిసారి ఇంత దగ్గరినుంచి చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు అన్నీ అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి మీరేనని పదో తరగతి విద్యార్థిని రిష్మ ఆనందం వ్యక్తం చేసింది.

ఏడో తరగతి విద్యార్ధి అనుదీప్ మాట్లాడుతూ తనకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉందని, అప్పటివరకూ మీరే సిఎంగా ఉండాలని, తనకు మీ దగ్గర పీఎస్ గా పనిచేసే అవకాశం కల్పించాలని కోరాడు. విమర్శలు ఎన్ని వచ్చినా ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగించారని, దీన్ని కొనసాగించాలని సిఎం కు విజ్ఞప్తి చేశాడు.

జగన్ బాబు అనే విద్యార్ధి…. యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన సందర్భం నాటి కామెంటరీని ఆంగ్లంలో చెప్పి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు.

మేఘన అనే విద్యార్థిని కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 929 రూపాయలను సిఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. అయితే దానిలో 19 రూపాయలు మాత్రమే సిఎం తీసుకుని మిగిలిన డబ్బును ఆమెకే తిరిగి ఇచ్చారు.

విద్యార్థులతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ఆంగ్ల భాషా నైపుణ్యం మంత్రులను, సీనియర్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read : నేడు జగనన్న విద్యా దీవెన

RELATED ARTICLES

Most Popular

న్యూస్