Sunday, November 24, 2024
HomeTrending NewsGadapa Gadapaku: కులాల మధ్య కాదు - క్లాస్ ల మధ్య యుద్ధం: జగన్

Gadapa Gadapaku: కులాల మధ్య కాదు – క్లాస్ ల మధ్య యుద్ధం: జగన్

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రమంపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం తగదని, మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు.  మొత్తంగా 32 మంది ఎమ్మెల్యేలు త‌క్కువ రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింత‌గా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వర్క్‌షాప్‌ జరిగింది. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.

సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

⦿ సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన వారే ఉంటారు, ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు.
⦿ వారు సమర్థులై ఉండాలి, తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ ఉండి తీరాలి.
⦿ అయితే ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదు.
⦿ అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి.
⦿ నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించాలి
⦿ ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుంది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం.
⦿ జనవరి 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది.
⦿ పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి.
⦿ అలాగే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలి.


⦿ సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి.
⦿ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి.
⦿ ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి.
⦿ అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి.
⦿ ప్రతి ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి.
⦿ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు.
⦿ మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు.


⦿ ఇవాళ రాష్ట్రంలో కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది.
⦿ ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరంటే మనమే. మనం నష్టపోతే పేదవారు నష్టపోతారు.
⦿ మనం పొరపాటున కూడా అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు.
⦿ మోసంతో కూడిన రాజకీయాలు. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు.
⦿ వెన్నుపోటు రాజకీయాలు. అబద్ధాల రాజకీయాలు. ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు.
⦿ పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తాయి.
⦿ కాబట్టి దయచేసి అందరూ ధ్యాస పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు నిమిషాలు గడపండి.
⦿ మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం, మీకు ఎంతో మేలు చేస్తుంది.
⦿ మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది.

Also Read : ఎమ్మెల్యేలు కష్టపడితేనే ఫలితాలు: జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్