Sunday, January 19, 2025
HomeTrending Newsప్రాధాన్యతా క్రమంలో ఉపాధి పనులు :సిఎం

ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి పనులు :సిఎం

Upadhi Hami: ఉపాధిహామీ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. చేపట్టే పనుల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్  హెల్త్‌ క్లినిక్స్, వైయస్ఆర్డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవాలని సూచించారు. అమూల్‌ పాలసేకరణ చేస్తున్న జిల్లాల్లో త్వరితగతిన బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల‌ను పూర్తిచేయాల‌ని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేయడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాల‌ని సిఎం విజ్ఞప్తి చేశారు.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైయ‌స్ఆర్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్‌ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

⦿ గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలి
⦿ మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఈ పనులు  ఏడాదిలోగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి
⦿ వైయ‌స్ఆర్ జలకళ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలి
⦿ ఈ రిగ్గు ద్వారా రైతులకు బోర్లు వేయించాలి, దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుంది
⦿ గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారు
⦿ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిశాయి.
⦿ దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయ‌న్నారు. క్రమం తప్పకుండా చేయాల్సిన నిర్వహణను వదిలేశారు
⦿ అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింది
⦿ భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ ఉండాలి
⦿ ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్‌ పనులు నిర్వహించాలి
⦿ నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళికను రూపొందించాలి


⦿ జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి
⦿ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ధ్యాస పెట్టాలి
⦿ గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక  శ్రద్ధపెట్టాలి
⦿ ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన విధానం తీసుకురావాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, సెర్ఫ్‌ సీఈఓ ఎండి ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియా పాండే ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు జరయ్యారు.

Also Read :మహిళా సాధికారత కోసమే: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్