Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వాక్సిన్ పై విపక్షాల రాజకీయం : సిఎం

వాక్సిన్ పై విపక్షాల రాజకీయం : సిఎం

వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, లభ్యత రాష్ట్ర పరిధిలోవి కావని అందరికీ తెలిసినా కావాలనే రాజకీయం చేస్తున్నారని సిఎం అన్నారు.

నెలకు 19లక్షలకుపైగా డోసులే వస్తున్నాయని, వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌టెండర్‌కు వెళ్లడంపై అధికారులు ఆలోచించాలని సీఎం అధికారులను కోరారు. రాష్ట్రంలో 104 వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. 104కు కాల్‌ చేసిన వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్