Wednesday, May 29, 2024
HomeTrending Newsదిగజారి రాయకండి: కొన్ని మీడియా సంస్థలకు సిఎం సూచన

దిగజారి రాయకండి: కొన్ని మీడియా సంస్థలకు సిఎం సూచన

పేద పిల్లలకు ట్యాబులు పంపిణీ చేస్తుంటే కొన్ని పత్రికలు దుర్భుద్ధితో విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని, గేమ్స్ ఆడుతున్నారంటూ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలు మీద తప్పుడు రాతలు రాస్తున్నా’రంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పనిగట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని…’జగన్‌ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని జగన్ ప్రస్తావించారు.  ‘ఇది పేపరా.. పేరుకు పట్టిన పీడా… ఇలాంటి పేపర్‌ను చదవొచ్చా’ అంటూ ధ్వజమెత్తారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ చేసిన సిఎం ఆ తర్వాత జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:

* గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి, ఈ 55 నెలల కాలంలో ఎలా ఉన్నాయో చూడాలని కోరుతున్నాం
* ప్రయివేటు స్కూళ్లన్నీకూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చింది
* జగన్‌ దుబారాగా డబ్బులు ఖర్చుచేస్తున్నారని గిట్టని వారు అంటున్నారు
* మేం చేసే ప్రతి పైసాకూడా మానవవనరుల అభివృద్దికోసం పెడుతున్నాం
* ప్రతి పైసాకూడా రేపటి భవిష్యత్తుమీద పెడుతున్నాం
* పిల్లలు అందరికీ కూడా ఇవ్వగలిగే ఆస్తి చదువులు మాత్రమే
* అప్పుడే పేదల తలరాతలు మారుతాయి
* మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద బురదజల్లుతున్నారు
* పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని ఆరాటపడుతున్నాం

* మంచి చేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు
* ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు
* పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా చెప్తున్నారు
* ఇంతగా దిగజారి రాతలు రాయకండి, మాటలు మాట్లాడకండి
* పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కకండి
* పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దని చెప్తున్నా
* మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, లాప్ టాప్స్ఉండొచ్చు, స్మార్ట్‌ ఫోన్లు ఉండొచ్చు
* కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాపుట్యాపులు ఉండకూడదు, స్మార్ట్‌ ఫోన్లు ఉండకూడదు
* మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల్లో మాత్రం ఉంటే చెడిపోతారు
* మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషులో మాత్రం చదవకూడదు
* పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుందట…

* కాని వాళ్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి.. ఇది ధర్మమేనా? ఇది సరైన పోకడేనా?
* ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు
* ఒకవైపు జగన్‌ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందంటారు
* మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అనిచెప్తున్నాడు
* దాని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా పెడుతున్నాడు
* వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజురియింబర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్‌ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ
* ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు
* మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాను.. మీకు మంచి జరిగితే. మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడాలని కోరుతున్నాను

* నేను నమ్ముకున్నది పైన ఉన్న దేవుడ్ని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా
* మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి
* మళ్లీ మోసం చేసేందుకు వీళ్లంతా బయల్దేరారు
* ప్రతి ఇంటికీ కేజీ బంగారం, ఒక బెంజికారు ఇస్తానంటున్నారు
* మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాను

RELATED ARTICLES

Most Popular

న్యూస్