Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్CM Jagan: మద్దాలి గిరిధర్ కు సిఎం పరామర్శ

CM Jagan: మద్దాలి గిరిధర్ కు సిఎం పరామర్శ

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ను గుంటూరులోని ఆయన స్వగృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. నిన్న సోమవారం ఉదయం గిరిధర్ తల్లి శివపార్వతి (68) అనారోగ్యంతో మరణించారు. బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిఎం జగన్ నిన్న ఉదయం మచిలీపట్నంలో పర్యటించారు.

నిన్న గిరిధర్ నివాసానికి వెళ్ళలేకపోయిన సిఎం ఈ ఉదయమే గుంటూరు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, శివపార్వతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఎం వెంట మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జున, ఇతర నేతలు కూడా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్