Saturday, May 11, 2024
HomeTrending Newsఎలాంటి పరిమితులూ లేవు: సిఎం జగన్

ఎలాంటి పరిమితులూ లేవు: సిఎం జగన్

No restrictions: జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితులూ లేవని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ  అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పడడానికి, సాధికారిత కల్పించడానికి ఈ పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే వీటిని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి  అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మంచి మేనమామగా అందిస్తానని వెల్లడించారు.

2021 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 10.82 లక్షల మంది విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద  రూ.709 కోట్లను సచివాలయంలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సిఎం జగన్ జమ చేశారు.  ఈ సందర్భంగా జగం మాట్లాడుతూ చదువు అనే ఒక ఆస్తి జీవితాలను, జీవన ప్రమాణాలను మార్చివేస్తుందని, ఓ కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా.. అడుగు ముందుకు వేయాలన్నా చదువే  ఆయుధంగా ఉపయోగపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక మంచి పథకాల్లో తనకు చాలా సంతోషాన్నిచ్చేవి విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలని వెల్లడించారు.

సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

⦿ 100 శాతం అక్షరాస్యత ఉన్న సమాజాల్లో  శిశుమరణాలు, జన్మ సమయంలో తల్లుల మరణాలు తక్కువగా ఉంటాయి
⦿ విద్య అనేది జీవితంలో నాణ్యతను, జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది
⦿ ఒక పిల్లవాడు ఒక ఊరు నుంచి డాక్టర్‌ అయితే ఆ కుటుంబంతో పాటు గ్రామం కూడా బాగుపడుతుంది
⦿ డబ్బులు లేకపోవడం వల్ల చదువులు ఆపే పరిస్థితి రాకూడదనేది నేను గట్టిన నమ్మిన సిద్ధాంతం
⦿ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యావ్యవస్థలో ఒక విప్లవం తీసుకొచ్చారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను తీసుకువచ్చారు
⦿ ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్‌ కోర్సుల చదివే విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం
⦿ క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ఇవ్వడమే కాకుండా . ఎటువంటి ఎరియర్స్‌ లేకుండా ఇస్తున్నాం
⦿ వసతి దీవెన అనే గొప్ప ఆలోచన చేశాం
⦿ బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కోసం మెడిసిన్, ఇంజనీరింగ్‌ చదివే పిల్లలకు రూ.20వేలు
⦿ పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు రూ.15వేలు
⦿ ఐటీఐ చదివే పిల్లలకు రూ.10వేలు సంవత్సరానికి రెండు దఫాలుగా ఉందిస్తున్నాం
⦿ జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన  పథకాల కోసం మన ప్రభుత్వం రూ.9274 కోట్లు ఖర్చు చేసింది
⦿ వసతి దీనెన అనే కార్యక్రమంలో కూడా మనం ప్రతి విద్యార్ధికి ఇస్తున్న రూ.20 వేలులో ఇప్పటికే రూ.10వేలు ఇచ్చాం
⦿ రెండో విడత ఏప్రిల్‌ 5న ఉంటుంది
⦿ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజల్లోకి వెళ్లి దీన్ని ప్రారంభిస్తాం
⦿ ఇది కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది
⦿ విద్యా దీవెన  పథకానికి  ఎలాంటి పరిమితులు లేవు
⦿ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలను చదవించండి
⦿ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన అందరికీ ఇస్తాం
⦿ నాడు–నేడు గొప్ప కాన్సెస్ట్‌తో సూళ్లు అన్ని రూపురేఖలు మారుతున్నాయి
⦿ సబ్జెక్టు టీచర్‌ అంశాన్ని ప్రవేశపెడుతున్నాం
⦿ ఉన్నత విద్యలో సిలబస్‌లో కూడా పెద్ద ఎత్తున మార్పులు తెస్తున్నాం
⦿  జాబ్‌ ఓరియెంటెడ్‌ సిలబస్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి
⦿ అప్రంటిషిప్‌ విధానం తప్పనిసరి చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం

అని సిఎం జగన్ వివరించారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్