Sunday, January 19, 2025
HomeTrending Newsకైకాల మృతి పట్ల సిఎం సంతాపం

కైకాల మృతి పట్ల సిఎం సంతాపం

సుప్రసిద్ధ సినీ నటుడు, నవరస నటనా నట సార్వ భౌమ కైకాల సత్యనారాయణ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటుణ్ణి కోల్పోయిందని అన్నారు. విభిన్న పాత్రలు పోషించిన ఓ గొప్ప నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగానూ ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు.

“గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తన సంతాప సందేశంలో జగన్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్