Friday, May 2, 2025
HomeTrending NewsE-Autos: సిఎం చేతులమీదుగా 516 ఈ-ఆటోల పంపిణీ

E-Autos: సిఎం చేతులమీదుగా 516 ఈ-ఆటోల పంపిణీ

రాష్ట్రంలో 36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ.4.10 లక్షల విలువ చేసే 516 ఈ – ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న ధృడసంకల్పంతో.. పర్యావరణ హితంగా ఉంటూ, చిన్న మున్సిపాలిటీలపై నిర్వహణ భారం తగ్గేలా ఈ-ఆటోల పంపిణీ చేపట్టారు.  మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ- ఆటోల’ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్