Sunday, January 19, 2025
HomeTrending Newsటూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ప్రారంభం

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ప్రారంభం

పర్యాటకుల భద్రతే లక్ష్యంగా  ప్రత్యేకంగా 20  టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ  పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య పర్యాటక ప్రదేశాల్లో  వీటిని మొదటి విడతలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో  ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.  పోలీసులు  కూడా మన స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చామని వెల్లడించారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు. గ్రామ స్థాయిలో  మహిళా పోలీసులు సచివాలయాల  ద్వారా అందుబాటులోకి వచ్చారని, జీరో ఎఫ్ఐఆర్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. పోలీస్ స్టేషన్ల తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో  ఫోన్ నంబర్ ను పర్యాటకులు అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, డిజిపి డా. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్