Sunday, November 24, 2024
HomeTrending Newsసంక్షేమం ప్రజలకు వివరించండి: సిఎం

సంక్షేమం ప్రజలకు వివరించండి: సిఎం

వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా మనం చేస్తోన్న మంచిని  ప్రజలకు విపులంగా చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ రాజాం అసెంబ్లీ నేతలను కోరారు. నియోజకవర్గ ముఖ్య నేతల భేటీల్లో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లా రాజాం కు చెందిన నేతలతో జగన్ సమావేశమయ్యారు. మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని, గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింత పెరగాలని సూచించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

  • రాజాం నియోజకవర్గానికి సంబంధించి కేవలం డీబీటీ కిందే రూ.775 కోట్లు ఇచ్చాం
  • ప్రతి ఇంటికీ వారివారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం
  • మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నాం
  • ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం
  • ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆ శీర్వదించండి అని ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతున్నాం
  • మంచి చేసిన తర్వాతనే మనం ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడుగుతున్నాం
  • ఈ నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం
  • దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం
  • వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నాం
  • వీటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది

  • ఇక మనం చేయాల్సింది.. చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవాలి
  • దీనికి కార్యకర్తలుగా మీ కృషి ఎంతో అవసరం
  • పార్టీపరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి
  • దాదాపు 24 అనుబంధ విభాగాలు మనకుఉన్నాయి, ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి
  • ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి: బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి
  • వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి, మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడాలి
  • ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మను బాగా చూసుకుంటే కుటుంబాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి పథకంకూడా అక్కచెల్లె్మమ్మ పేరుతోనే పెట్టాం: అందుకే వీరిని భాగస్వామ్యంచేయాలి
  • సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతాపనులకు మంజూరుకూడా చేస్తున్నాం
  • మళ్లీ మనం అఖండ మెజార్టీతో గెలవాలి
  • గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించండి
  • ఈసారి మన టార్గెట్‌ 151 కాదు, 175 కి 175 సీట్లలో గెలుపు సాధించాలన్నది మన టార్గెట్‌
  • మనం అంతా ఇంకా 30 సంవత్సరాలు కలిసికట్టుగా రాజకీయాలు చేయాలి
  • జీవితంకాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలి
  • మన తీసుకొచ్చిన మార్పులు అన్నీకూడా మన కళ్లముందే ఫలితాలను ఇస్తాయి
  • ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారు

అంటూ దిశా నిర్దేశం చేశారు.

Also Read : పన్నుల వసూళ్ళలో పారదర్శకత: సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్