Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు మేలు: సిఎం

YS Jagan: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు మేలు: సిఎం

ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేస్తామని తద్వారా పండ్లు, కూరగాయల రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 1719 కోట్ల రూపాయల వ్యయంతో  చేపట్టి… ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఆరు ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సిఎం ప్రారంభించారు. వీటితో పాటు మరో 5 యూనిట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన కూడా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో 13 సెకండరీ యూనిట్లు కూడా త్వరలో రైతులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మిల్లెట్లను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో అనుసంధానం చేసింది కూడా మన రాష్ట్రమేనని స్పష్టం చేశారు. మినిమం సపోర్ట్ ప్రైస్ తో కూడా మిల్లెట్స్ ను చేర్చామన్నారు.

వ్యవసాయశాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్‌, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, పలువురు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు హాజరు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్