Thursday, January 23, 2025
HomeTrending NewsYS Jagan: జల్లెడ పట్టి అర్హుల గుర్తింపు: సిఎం

YS Jagan: జల్లెడ పట్టి అర్హుల గుర్తింపు: సిఎం

ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకు వెళ్లేందుకే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. “నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష” అని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో నేటినుంచి నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుండి జగన్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి సిఎం పలు సూచనలు చేశారు….

  • జగనన్నకు  చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ‘జగనన్న సురక్ష’ను చేపట్టాం. దీని ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్తారు
  • అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు కాని, పలానా లబ్ధి కాని అందలేదని చెప్పే అవకాశం ఉండకూడదు
  • జల్లెడ పట్టి మరీ అర్హులను గుర్తించి పథకాలతో పాటు వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తారు
  • నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ గ్రామాన్ని…వార్డును…పట్టణాన్నితీసుకున్నా, ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి
  • ఏ పని కోసం వెళ్లినా మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడిగేవారు, నాలుగేళ్లలో పరిస్థితిని పూర్తిగా మార్చాం
  • పెన్షన్‌ కావాలన్నా.. రేషన్‌ కావాలన్నా నేరుగా ఇంటికే తీసుకువచ్చే గొప్ప వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే దీన్ని తీసుకు వచ్చాం

  • కులం చూడకుండా, మతం చూడకుండా, చివరకు వారు ఏ పార్టీవారో చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా ఎక్కడా ఒక్క రూపాయికూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు లేకుండా పౌరసేవలు అందించడం మన ప్రభుత్వంలోనే ప్రారంభం అయ్యింది
  • ప్రతిపక్షాలకు అజెండా అన్నది ఏదీ మిగల్లేదు
  • పెన్షన్లు కానివ్వండి, రేషన్‌ కార్డులు కానివ్వడం, ఇళ్లపట్టాలు కానివ్వండి, ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా.. అత్యంత పారదర్శకంగా అందుతున్నాయి
  • అంతకు మించి నవరత్నాల ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అక్షరాల రూ. 2.16 లక్షల కోట్లు బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమచేయడం జరిగింది
  • ఒక గొప్ప విప్లవం గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వ పాలనలో తీసుకు రాగలిగాం
  • ఈ విప్లవంలో భాగంగానే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే తపనతో జగనన్న సురక్ష చేపట్టాం
  • అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జులై, డిసెంబర్‌ మాసాల్లో లబ్ధిదారులకు సంక్షేమం మంజూరు చేస్తున్నాం
  • దీనికి మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించాం
  • ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడైనాకూడా, ఎవ్వరైనా కూడా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో, అందాల్సిన మంచి అందకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదని పేదవాళ్లకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతోనే దీన్ని చేపడుతున్నాం

  • కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే 2500 ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం, కేంద్రం ఇప్పటికే ఆధార్‌ మార్పులకు సంబంధించి విధివిధానాలు ప్రకటించాం
  • వీటిప్రకారం సేవలను జగనన్న సురక్షా ద్వారా  అందిస్తారు
  • ఇలా ఎలాంటి సాంకేతిక సమస్యల వల్లనైనా నిజంగా అర్హత ఉండి.. ఏ ఒక్కరైనా, ఎవ్వరైనా మంచి జరగని పరిస్థితి ఉందంటే… దాన్ని సరిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది
  • ఎలాంటి సర్వీసు ఛార్జీలు కూడా ప్రభుత్వం వసూలు చేయడదు

అంటూ అధికారులకు నిర్దేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్