Tuesday, April 22, 2025
HomeTrending NewsGovernor-CM: గవర్నర్ తో సిఎం భేటీ

Governor-CM: గవర్నర్ తో సిఎం భేటీ

రాష్ట్ర గవర్నర్ జస్టిస్  అబ్దుల్ నజీర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలోని  రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం వీరి భేటీ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. మొన్న టిడిపి నేతలు గవర్నర్ ను కలుసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఫిర్యాదు చేయడం, రాష్ట్రంలో 355 ఆర్టికల్ పెట్టాలని, శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.  రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ కు సిఎం జగన్ నివేదించి ఉంటారని సమాచారం.

కాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా వెళ్ళిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు గవర్నర్ ను ఆహ్వానించారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్