Saturday, January 18, 2025
HomeTrending Newsసూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి

సూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి

దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భౌతిక కాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్న సిఎం నేరుగా పద్మాలయా స్టూడియోస్ కు చేరుకొని కృష్ణ పార్ధీవ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి నమస్కరించారు. అనంతరం అయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.  కృష్ణ తనయుడు, హీరో మహేష్ బాబు, కుమార్తెలతో కాసేపు మాట్లాడి వారిని ఓదార్చారు. కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జగన్ కు కుటుంబ సభ్యులను పరిచయం చేశారు.

సిఎం జగన్ వెంట రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు ఉన్నారు.

సిఎం జగన్ అక్కడకు చేరుకున్న సమయంలోనే హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు ఉన్నారు.

Also Read :  ఒకే సంవత్సరం మూడు విషాదాలు.. బాధలో మహేష్‌ బాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్