Friday, June 12, 2026
HomeTrending Newsఢిల్లీకి సిఎం జగన్: నేడు సన్నాహక సదస్సు

ఢిల్లీకి సిఎం జగన్: నేడు సన్నాహక సదస్సు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో చాణక్యపురిలోని లీలా రెసిడెన్సీ హోటల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొంటారు.

నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిమిషాల వ్యవధిలో గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా సిఎంవో అధికారులు హైదరాబాద్ నుంచి మరో విమానం రప్పించారు. దానిలో గతరాత్రే  మళ్ళీ బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. నేటి సాయంత్రం వరకూ సదస్సులో పాల్గొని రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.

Also Read : సిఎం విమానంలో సాంకేతికలోపం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular