Sunday, January 19, 2025
HomeTrending Newsరీసర్వేలో వేగం పెంచాలి : సిఎం ఆదేశం

రీసర్వేలో వేగం పెంచాలి : సిఎం ఆదేశం

రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలని, నాణ్యత ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత సర్వే చేస్తున్నామంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని, వారి సేవలు వినియోగించుకొని రీసర్వే పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.  వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

తొలివిడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని జనవరి నాటికి పూర్తిచేయాలని సూచించారు.  తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92వేలు ఫస్ట్‌ టైం ఎంట్రీస్‌ జరగ్గా,  7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని అధికారులు తెలిపారు.

4.30 లక్షల సబ్‌ డివిజన్లు పూర్తి చేశామని, 19వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయని తద్వారా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని వివరించారు. మరో 2వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు 2023,  పిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచలను చేస్తూ….

  • సమగ్ర సర్వే సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి
  • గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకొని  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలి
  • ఖాళీలున్నచోట వెంటనే నియామకాలు చేపట్టాలి
  • 22– ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలి
  • ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలును తెలియజేసేలా.. లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలి
  • హక్కు పత్రాలు పొందిన వారందరికీ లేఖలు రాయాలి
  • సర్వే రాళ్లపైనా సీఎంకు వివరాలందించిన అధికారులు
  • భూగర్భ గనులుశాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలన్న సీఎం.
  • మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామన్న అధికారులు.
  • ఇందుకోసం అవసరమైన ప్రొడక్షన్‌ కెపాసిటీనీ మైనింగ్‌ శాఖ పెంచుకోవాలని, ఎలాంటి జాప్యానికి తావుండరాదన్న సిఎం
  • అర్బన్ ప్రాంతాల్లో సర్వేపైనా సీఎం సమీక్ష
  • 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4119 వార్డు సచివాలయాల్లో ఇప్పటికే సర్వే కోసం అవసరమైన బృందాల ఏర్పాటు, శిక్షణ పూర్తయిందన్న అధికారులు.
  • హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్‌ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరునాటికి పూర్తిచేస్తామన్న అధికారులు.
  • ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్‌ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలు భూమిని గుర్తించామన్న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు.
  • జూలై 2023 నాటికి పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు.

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి,  ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్