Saturday, November 23, 2024
HomeTrending Newsవిలేజ్, వార్డు యూనిట్ గా ఎస్డీజీ సాధన: సిఎం

విలేజ్, వార్డు యూనిట్ గా ఎస్డీజీ సాధన: సిఎం

సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ ) సాధనాలు విజేజ్, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ ఓడిలు నెలకు కనీసం రెండు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఎస్డీజీ లక్ష్యాలపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ప్రగతి లక్ష్యాల సాధనపై క్రమం తప్పకుండా వివరాలు నమోదుచేస్తున్నారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలని, ఇకపై ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతినెలాకూడా డేటా అప్‌లోడ్‌ చేయాలని,  ఇదే డేటా ఈ డేటా జేసీ, కలెక్టర్లకు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.  డేటాను అప్‌లోడ్‌ చేయడమే కాకుండా, ఎక్కడైనా లోపం ఉన్నట్టుగా తెలిస్తే.. వెంటనే దానికి పరిష్కారాలు  ఆలోచించాలని, దీనికోసం ఎస్‌ఓపీలు రూపొందించాలన్నారు.

ఎమ్మార్వో, ఎండీవోలానే ప్రతి ప్రభుత్వ విభాగానికీ పర్యవేక్షణ కోసం మండలస్థాయిలో ఒక అధికారి ఉండేలా చూడాలన్నారు. దీనివల్ల సచివాలయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఉంటుందన్నారు.  ప్రగతి లక్ష్యాలపై ప్రతి గ్రామంలోనూ  వాలంటీర్లతో  సర్వే నిర్వహించి  వివరాలు నమోదు చేయాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్