Saturday, November 23, 2024
HomeTrending Newsరికార్డులు వెంటనే అప్ డేట్ కావాలి: సిఎం

రికార్డులు వెంటనే అప్ డేట్ కావాలి: సిఎం

భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్‌డేట్‌ కావాలని, దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.  పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తుల రికార్డుల్లో వెంటనే అప్‌డేట్‌ కావాలని నిర్దేశించారు.  అప్పుడే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’పై సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్‌ చేసిన సూచనలు

⦿ రికార్డుల అప్ డేట్ కోసం ల్యాండ్ రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో పెట్టాలి
⦿ వీరు ఇచ్చిన సిఫార్పుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియలకు సంబంధించి ఎస్‌ఓపీలు రూపొందించాలి
⦿ గ్రామ సచివాలయాల్లోనే ఈప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలి
⦿ ప్రజలు వీటికోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన ఎస్‌ఓపీ రూపొందించాలి
⦿ ల్యాండ్‌ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలి
⦿ తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలి
⦿ సర్వేకు సంబంధించి డేటా భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలి
⦿ దీనిపై అనుభవం ఉన్న వ్యక్తులు, సంస్థలతో మాట్లాడాలి
⦿ ల్యాండ్‌ రికార్డుల అప్‌డేషన్‌ను ప్రతి ఏటా ఒక వారంలో చేపట్టాలి


⦿ దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశం.
⦿ ల్యాండు రికార్డుల అప్‌డేషన్, రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలి
⦿ మనం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కడా అవినీతికి చోటులేని విధంగా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలి
⦿ సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలి
⦿ గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశంలో  చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి
⦿ 22ఎ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది
⦿ అధికారులు కూర్చొని దీనిపై ఒక విధానం తీసుకురావాలి
⦿ ఇలాంటి తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలి
⦿ తగినన్ని మార్గదర్శకాలు పటిష్టంగా రూపొందించాలి
⦿ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో పెట్టాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలి
⦿ దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను కూడా బలోపేతంచేయాలి

ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణాశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి,  రెవెన్యూశాఖ కమిషనర్‌ (సర్వే, సెటిల్‌మెంట్స్‌) సిద్దార్ధ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం ఎం నాయక్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్