Tuesday, May 14, 2024
HomeTrending Newsఅన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం

అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం

గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, వారికి రైతు భరోసా కూడా వర్తింపజేశామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో వారికే సంపూర్ణ రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం జరగనుంది.

ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

 సందర్భంగా సిఎం జగన్ ప్రస్తావించిన అంశాలు.

⦿ ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులకు ప్రతి ఏటా రూ.13,500 అందిస్తున్నాం
⦿ ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగుకోసం కార్యాచరణకూడా రూపొందించాం
⦿ ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం
⦿ 31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చాం
⦿ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్లగా వారిని నియమించాం
⦿ పెద్ద సంఖ్యలో గిరిజనులకు ఉద్యోగాల కల్పన జరిగింది, వారి గ్రామాల్లోనే వారికి ఉద్యోగాలు ఇచ్చాం:
⦿ 36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు – నేడు కింద మెరుగుపరుస్తున్నాం
⦿ నాడు – నేడు కార్యక్రమాలకు తగిన సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలి
⦿ షెడ్యూలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలకూ తగిన సహకారం కోసం కేంద్రాన్ని అడగాలి


⦿ ట్రైబల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్‌ జాగ్రత్తగా చేయాలి
⦿ దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నామన్న అధికారులు
⦿ సమగ్రంగా ఇంటర్నెట్, మొబైల్‌ టెలికాం సౌకర్యం ఇచ్చేలా విధానం ఉండాలన్న సీఎం
⦿ దీనిపై ఒక ప్రణాళిక రూపొందించి, ఆమేరకు కేంద్రం సహకారం కోరాలి
⦿ అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్, మొబైల్‌ సౌకర్యం కల్పించాలి
⦿ గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతిచోటా కూడా పోస్టాఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలి
⦿ ట్రైబల్‌ యూనివర్శిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి
⦿ గిరిజనుల్లో చాలామంది పిల్లలకు ఆధార్‌ లేదన్న అధికారులు
⦿ ట్రైబల్‌ ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్‌ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలని సిఎం సూచన

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ప్రిన్స్‌పల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ రంజిత్‌ బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్