పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలని ఆశయం పెట్టుకున్నారు. కానీ అందుకు అవసరమైన శిక్షణ పొందే ఆర్ధిక స్థోమత ఆమెకు లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐ అండ్ పీ ఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ద్వారా జూలై నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఆమె తీసుకు వెళ్ళారు. దీనిపై స్పందించిన సిఎం జాహ్నవికి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ బుధవారం అమరావతి సచివాలయం నాలుగో బ్లాక్ లో దంగేటి జాహ్నవికి ఈ రూ.50 లక్షల చెక్కును అందజేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఒక పేద విద్యార్థి కలను సాకారం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేసిన ముఖ్యమంత్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చదవాలనే తపన ఉండి, చదివి, ఎదిగి ఈ దేశానికి కీర్తిని తేవాలనే నిరుపేద విద్యార్థులకు ముఖ్యమంత్రి అండ అందనంత ఎత్తుగా ఉంటుందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల వారి ఉన్నతికి విద్యా విప్లవాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉంటారని కొనియాడుతూ ధన్యవాదాలు తెలిపారు.
దంగేటి జాహ్నవి మాట్లాడుతూ పంజాబ్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న తనకు వ్యోమగామి అవ్వాలనే తపన ఎంతగానో ఉందన్నారు. ఆ లక్ష్యంతోనే నాసాతో పాటు పోలాండ్ లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందడం జరిగిందన్నారు. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉందన్నారు. కానీ అందుకు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించ నందున ఆర్థిక సహాయం నిమిత్తం ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందిస్తూ నెల రోజుల కాలవ్యవధిలోనే ఆర్థిక సహాయాన్ని అందజేశారంటూ ధన్యవాదా తెలిపింది. దములు తెలిపింది. సిఎం దీవెనలతో త్వరలోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
ప్రభుత్వ చీఫ్ విఫ్ ముదునూరి ప్రసాద రాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాసరావు, దంగేటి జాహ్నవి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : సిఎం జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి