Sunday, January 19, 2025
HomeTrending Newsఇదే మా పాలనకు నిదర్శనం: జగన్

ఇదే మా పాలనకు నిదర్శనం: జగన్

Administrative reforms: కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబునాయుడు, హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని అయన బావమరిది  తమ ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే … ఇదే తమ పాలనా తీరుకు నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము పరిపాలనను ప్రజల వద్దకు తీసుకు వెళ్ళే సంస్కరణలను చేపట్టామని, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్ళు నాడు-నేడు తో పాటు ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. బాబు తన పరిపాలనలో కనీసం కుప్పంను రెవిన్యూ డివిజన్ గా కూడా చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. గవర్నర్  ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సిఎం జగన్ మాట్లాడారు.

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ పట్ల తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు దారుణమని సిఎం మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియకూదడనే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూశారని, ప్రసంగ ప్రతులను చించివేశారని  ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్  ప్రసంగం తరువాత వెళ్ళిపోయే సమయంలోనూ ఆయనపై నినాదాలు చేశారని చెప్పారు. చంద్రబాబు సభకు రాకపోయినా తన కుమారుడు లోకేష్, ఇతర ఎమ్మెల్యేలతో ఇలా చేయించారని, ఇది తగదని పేర్కొన్నారు. తాను అధికారంలో లేకపోది రాజ్యంగ వ్యవస్థలను చంద్రబాబు ఏమాత్రం గౌరవించరని విమర్శించారు.

చంద్రబాబు ఇన్నేళ్ళ పరిపాలనలో  ఆయనను చూడగానే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. కానీ అయన పేరు చెప్పగానే వెన్నుపోటు మాత్రం గుర్తుకు వస్తుందని  వ్యంగ్యంగా చెప్పారు. కరోనా సంక్షోభంతో ఆర్ధిక వ్యవస్థ తలకిందులైనా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని, ఇప్పటికే 95 శాతం హామీలు నేరవేర్చామన్నారు.  చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన ప్రజలు గత ఎన్నికల్లో 151 సీట్లతో తమను గెలిపించారని, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో తమ పార్టీనే ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారని గుర్తుచేశారు. చంద్రబాబు వైఖరికి ఛీ కొట్టారని విమర్శించారు. 34 నెలల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సిఎం జగన్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్