Friday, February 28, 2025
HomeTrending NewsYS Jagan: నేడు నాలుగో ఏడాది జగనన్న అమ్మ ఒడి

YS Jagan: నేడు నాలుగో ఏడాది జగనన్న అమ్మ ఒడి

పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకానికి నాలుగో ఏడాది నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. నేడు బుధవారం 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల అకౌంట్లలో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు అందించనున్నారు. దీని ద్వారా 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి  చేకూరనుంది. నేటినుంచి 10 రోజులపాటు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం అమలు కానుంది.

నేడు అందిస్తున్న రూ.6,392.94 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం జగనన్న అమ్మఒడి  ద్వారా అందించిన లబ్ధి రూ. 26,067.28 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒక్క విద్యా రంగంలో  సంస్కరణలపై -ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ‘ ఈ నాలుగేళ్లలో చేసిన వ్యయం అక్షరాలా రూ. 66,722.36 కోట్లు అని అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది.

జగనన్న అమ్మ ఒడి – లబ్ధిదారుల సంఖ్య – 44,48,865, అందించిన మొత్తం రూ. కోట్లలో 26,067.28
జగనన్న విద్యా కానుక – లబ్ధిదారుల సంఖ్య – 43,10,165 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,366.53
జగనన్న గోరుముద్ద – లబ్ధిదారుల సంఖ్య – 43,26,782 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,590.00
పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ – స్కూల్స్ సంఖ్య – 15,715 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,669.00
పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ – స్కూల్స్ సంఖ్య – 22,344 అందించిన మొత్తం రూ. కోట్లలో 8,000.00
వైఎస్సార్ సంపూర్ణ పోషణ – లబ్ధిదారుల సంఖ్య – 35,70,675 అందించిన మొత్తం రూ. కోట్లలో 6,141.34
స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ – లబ్ధిదారుల సంఖ్య – 10,01,860 అందించిన మొత్తం రూ. కోట్లలో 32.00
డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ట్యాబ్లు – లబ్ధిదారుల సంఖ్య – 5,18,740 అందించిన మొత్తం రూ. కోట్లలో 685.87
జగనన్న విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 26,98,728 అందించిన మొత్తం రూ. కోట్లలో 10,636.67
జగనన్న వసతి దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 25,17,245 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,275.76
జగనన్న విదేశీ విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 1,858 అందించిన మొత్తం రూ. కోట్లలో 132.41
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా – లబ్ధిదారుల సంఖ్య – 16,668 అందించిన మొత్తం రూ. కోట్లలో 125.50
మొత్తం రూ. 66,722.36 కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్