రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు’ పథకం మూడో ఏడాది సాయాన్ని నేడు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని జనవరి 30న, సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సిఎం జగన్ జమ చేయనున్నారు.
షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న దానితో కలిపి ఇప్పటి వరకూ ఒక్కో లబ్ధిదారుడికి 30,000 రూపాయలు చొప్పున అందించినట్లు అవుతుంది. ఈ మూడేళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 927.51 కోట్లకు చేరుతుంది.