Iftar: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఇఫ్తార్ కు ముందు విజయవాడ వన్ టౌన్ లో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సిఎం జగన్ ప్రారంభిస్తారు.
ఇఫ్తార్ విందుతో పాటు సిఎం నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రులు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోర్డినేటర్లు, మంత్రులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అవుతారు. సాయంత్రం ముసాఫిర్, ఇఫ్తార్ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మంగళగిరి సీకే ఫంక్షన్ హాల్ లో గుంటూరు జడ్పీ ఛైర్మన్ క్రిస్టినా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో ఇఫ్తార్ ఏర్పాట్లను నిన్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్ , కలెక్టర్ దిల్లీ రావు, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దీనకర్ ఇతర అధికారులు పరిశీలించారు.
Also Read : మీరు నా కళ్ళు, చెవులు: సిఎం జగన్