Sunday, January 19, 2025
HomeTrending Newsనేటి నుంచే పెంచిన పెన్షన్ పంపిణీ

నేటి నుంచే పెంచిన పెన్షన్ పంపిణీ

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఇస్తున్న 2250 రూపాయల పెన్షన్ ను 2500కు పెంచి ఇవ్వనుంది. కొత్త సంవత్సరం కానుకగా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభిస్తున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం గురించిన వివరాలు వెల్లడించింది.

⦿ గత ప్రభుత్వం హయాంలో సగటున నెలకు పెన్షన్ల రూపేణా చేసిన ఖర్చు నెలకు రూ. 400 కోట్లు
⦿  ఏడాది మొత్తం సగటు వ్యయం రూ.5,500 కోట్లు.
⦿ ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ ఉన్న పెన్షన్ల సంఖ్య కూడా 39 లక్షలు మాత్రమే.
⦿ రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాలలోపు మెట్ట పొలం ఉన్నవారికే పెన్షన్‌ ఇచ్చేవారు.
⦿ ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్‌ ఇస్తే.. రెండో వ్యక్తికి పెన్షన్‌ ఇచ్చేవారు కాదు.
⦿ పెన్షన్‌ కావాలంటే దరఖాస్తు ఎవరికి చేయాలో తెలియని పరిస్థితి. అర్హత సాధించాలంటే జన్మభూమి కమిటీకి ఆమోదం తప్పనిసరి
⦿ వికలాంగులకు రూ.1500, తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.2500 మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారు.
⦿ గ్రామానికి పెన్షన్లు ఇవ్వడానికి ఒకరు మాత్రమే వచ్చేవారు. సరైన వెయిటింగు హాల్‌గాని, పెన్షన్‌ తీసుకునేవారికి వసతులు కాని ఉండేవికావు. వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
⦿ పెన్షన్‌ తీసుకోవడానికి గంటలతరబడి క్యూలో నిలబడేవారు.
⦿ ఒకటో తారీఖున మొదలయ్యే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 10 రోజులు, 14 రోజులు పట్టేది.

ఈ ప్రభుత్వ హయాంలో…

⦿ పెన్షన్‌ పొందడానికి అర్హతను 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు
⦿ అవ్వాతాతలకు, వితంతువులకు, చేనేతలకు, కల్లుగీత కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, చర్మకారులకు, ⦿వైద్యసహాయం పొందుతున్న (ఏఆర్టీ) వారి పెన్షన్లను రూ.2250కు పెంపు
⦿ అలాగే వికలాంగుల పెన్షన్‌ను రూ.3వేలకు పెంపు
⦿ తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10వేల పెన్షన్‌
⦿ తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫీలియా, బోదకాలు, పక్షవాతం, కండరాల క్షీణత, తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి, కుష్టువ్యాధి, కిడ్నీ లేదా కాలేయం లేదా గుండె మార్పిడిని జరిగిన వారికికూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పెన్షన్లను మంజూరు
⦿ సూర్యోదయానికి ముందే.. అవ్వాతాతల చెంతకే పెన్షన్లు:
⦿ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ. పెన్షన్లు పొందడానికి వాళ్లు ఎలాంటి కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. రోజులతరబడి వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు.
⦿ దాదాపు 62 లక్షల మందికి ప్రతినెలా పెన్షన్లు అందుతున్నాయి.
⦿ ఇందులో బీసీలు 30,37,048 మంది ఉన్నారు. బ్రాహ్మణులు 23,190 మంది, ఈబీసీలు 10,98,616 మంది, కాపులు 3,93,266 మంది, మైనార్టీలు 2,30,510 మంది, ఎస్సీలు 10,29,440 మంది, ఎస్టీలు 3,62,523 మంది ఉన్నారు.
⦿ ప్రతినెలా రూ.1570 కోట్ల పైనే పెన్షన్లు కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఏడాదికి రూ.18వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.
⦿ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 30 నెలలుగా పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.45వేల కోట్లు.

Also Read : వృద్ధాప్య పెన్షన్ పెంపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్