Tuesday, September 17, 2024
HomeTrending Newsరేపటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్

రేపటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు.  దీనిలో భాగంగా  కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో  జరిగే పలు కార్యక్రమాల్లో అయన పాల్గొంటారు. ఈ టూర్ లో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరు కానున్నారు.

కడప అమీన్‌పీర్‌ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్‌ కార్యక్రమాలకు హాజరు, కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం లాంటివి ఈ పర్యటనలో ఉన్నాయి.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

రేపు  డిసెంబర్ 23న  ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.50 – 12.20 కడప అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 12.35 – 12.45 పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకుంటారు. 1.15 – 1.25 మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 – 3.45 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.50 ఇడుపులపాయ చేరుకుని వైయస్సార్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి అక్కడే బస చేస్తారు.

24.12.2022 షెడ్యూల్‌:
ఉదయం 9 గంటలకు వైయస్సార్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైయస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 9.10 – 9.40 వైయస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 10.00 – 12.00 ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొంటారు. 12.40 పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 1.10 – 1.20 విజయ హోమ్స్‌ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 – 1.40 కదిరి రోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 1.50 – 2.00 కూరగాయల మార్కెట్‌ ప్రారంభిస్తారు. 2.05 – 2.20 మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 2.35 – 2.50 రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 3.00 – 3.30 డాక్టర్‌ వైయస్సార్‌ బస్‌స్టాండ్‌ను ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 3.35 – 3.55 అహోబిలపురం స్కూలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. 4.05 – 4.20 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 4.30 – 4.45 జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సాయంత్రం 5.40 గంటలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

25.12.2022 షెడ్యూల్‌

ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.15 – 10.15 సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు. 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్