Monday, February 24, 2025
HomeTrending Newsవరద బాధితులకు సిఎం జగన్ భరోసా

వరద బాధితులకు సిఎం జగన్ భరోసా

CM Assurance:
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల బారిన పడిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో సిఎం జగన్ పర్యటించారు. తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలు, ఇళ్ళను పరిశీలించారు. గ్రామంలో కలియతిరుగుతూ బాధితులను పరామర్శించారు. వరద బాధితులు సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు.

వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జగన్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. ‘నేనున్నాను.. ధైర్యంగా ఉండండి’ అని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన రూ.90వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత నాది.. అన్ని విధాలుగా ఆదుకుంటానని జగన్‌ వారికి చెప్పారు. అనంతరం గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.

Also Read : త్వరలో ‘మూడు’ బిల్లు: బాలినేని

RELATED ARTICLES

Most Popular

న్యూస్