Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

సిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్. అని, త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే సందేశమని సిఎం పేర్కొన్నారు.

దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారని, ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళడం సంప్రదాయంగా భావిస్తారని గుర్తు చేశారు.  భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్