Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎం జగన్ దసరా శుభాకాంక్షలు

సిఎం జగన్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగ  సందర్బంగా  రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

(ఫోటో…. ఈ ఆదివారం(అక్టోబర్ 2న)   మూలా నక్షత్రం సందర్భంగా బెజవాడ కనక దుర్గమ్మకు సిఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించిన  సమయంలో ఆయనకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ,  దేవస్థానం ఈవో భ్రమరాంభ)

RELATED ARTICLES

Most Popular

న్యూస్