Saturday, November 23, 2024
HomeTrending Newsఅప్పులపై రంది అవసరం లేదు : కేసీఆర్‌

అప్పులపై రంది అవసరం లేదు : కేసీఆర్‌

రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌ రెండు రకాలుగా ఉంటుంది. ఒక గవర్నమెంట్‌ బడ్జెట్‌. ఒక ప్రైవేటు ఫ్యామిలీ బడ్జెట్‌. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. ప్రైవేటు బడ్జెట్‌ వాళ్ల బ్యాంకు బ్యాలెన్స్‌, సంవత్సరం వచ్చే మొత్తం మీద కలిపి వచ్చే ఆదాయంపై ఆధారపడి ప్లానింగ్‌ ఉంటుంది.
గర్నమెంట్‌ విషయంలో మొదటిసారి ప్లాన్‌ ప్రిపేర్‌ అవుతుంది. ఆ నిధుల కూర్పు జరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండే వైటల్‌ పవర్‌ రెండే రెండు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎవరిపైనా అయినా పన్ను విధించొచ్చు. టాక్స్‌ ఎక్కువైందా ? తక్కువైందా ప్రజాకోర్టులో ప్రజలకు నచ్చపోతే తీర్పు చెబుతారు. ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పదనమే అది. రాజ్యాంగం ప్రకారం.. కొన్ని పన్నులు రాష్ట్రాలు, కొన్ని కేంద్రం వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసిన రాష్ట్రాల వాటా. ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్స్‌ పోను.. పన్నేతర ఇంకో వెసులుబాటు మార్కెట్‌ బారోయింగ్‌. ఇవన్ని కలిపి సమాహారమే బడ్జెట్‌. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటున్న ప్రతిపక్షాలు.. అవి అప్పులు కాదు నిధుల సమీకరణ అని తెలుసుకోవాలన్నారు. నిధులు ఎలా సమకూర్చుకోవాలో చెప్పేదే బడ్జెట్ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సభలో విరిసిన నవ్వుల పువ్వులు..
భట్టి విక్రమార్కకు నా రెక్వెస్ట్‌. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం మంచి కార్యక్రమం అన్నారు. నేను ప్రతి సారి అంటా ఉంటా. భట్టి విక్రమార్క ప్రేమకు మేం నోచుకోలేదు. ఒక్కటన్న మంచిమాట మా గురించి చెప్పరని అంటా ఉంటా. ఈసారి వారికి ఎంతో కొంత దయగలిగింది ఓ మంచిమాట చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు స్వాతంత్య్ర వచ్చిన తొలినాళ్లలో జరిగిన ప్రయత్నాల్లో వచ్చిన అనేక గొప్ప గొప్ప సంస్థలు ఎట్లా నాశనం చేయబడుతున్నయో చాలా గట్టిగా చెబుతా ఉంటే భట్టి పార్లమెంట్‌లో ఉంటే బాగుంటది.. అందరం కలిసి రాష్ట్రం తరఫున ఆయనను పార్లమెంట్‌కు పంపాలని సీఎం కేసీఆర్‌ అనగా.. నవ్వుల పువ్వులు విరిశాయి.
విషయమంతా గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాపై కోపాన్ని మా మీద.. ‘అత్తమీద కోపం దుత్త మీద తీసినట్లు’ ఉందని.. మేం కాదు కదా చేసేది అన్నారు. మన వద్ద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతున్నామన్నారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థలను మన పరిధిలో ఉన్న మేరకు కాపాడుకుంటూ వస్తున్నాం. హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ పబ్లిష్ట్‌ బై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. డజన్ల కొద్ది విషయాల్లో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనప్పటికీ అద్భుతమైన విజయాలు సాధిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెబుతుంది. అన్నింటిపై ఆర్థికమంత్రి సవివరంగా వివరించారు. కానీ, అప్పుల విషయంలో భట్టి ఏదైతే అన్నరో ఈ రోజున్నటువంటి విజ్డమ్‌ ఆఫ్ ఎకానమీలో, ఎకనామిక్స్‌ డైనమిక్స్‌లో అప్పు కింద పరిగణించరు. వనరుల కింద పరిగణిస్తరు.

మనకన్నా 24 రాష్ట్రాలు అప్పులు ఎక్కువ చేశాయ్‌
కఠోరమైన శ్రమశిక్షణను పాటిస్తున్నాం. అవినీతిని అణచివేశాం. గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టాం. రైతుబంధు కింద రూ.50వేలకోట్లు ఇచ్చాం. ఈ రోజుల్లో మిమ్మల్ని (స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌) లక్ష్మీపుత్రుడని అనే వాన్ని. మీరు (స్పీకర్‌) వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే పథకాన్ని ప్రారంభించాం. వందశాతం పారదర్శకత. ఎక్కడా పైరవీలు లేవు.. మధ్య దళారులు లేరు. ఇలా అనేక విషయాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏదైనా ఉందో దాంట్లో పారదర్శకత పెంచాం.
అనేక సంస్కారవంతమైన ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలన దేశంలోని 28 రాష్ట్రాలు అప్పులు చేసే క్రమంలో మనం 25వ ర్యాంకులో ఉన్నాం. మన కన్నా 24 రాష్ట్రాల మనకన్నా చాలా ఎప్పులు ఎక్కువ చేశాయి. కాంగ్రెస్‌ పాలించే రాజస్థాన్‌, పంజాబ్‌లో ఎక్కువగానే ఉన్నది. ఇతర రాష్ట్రాలు ఇక సరేసరి. 25వ స్థానంలో ఉన్నామంటే చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం. అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. దీనిపై భట్టి విక్రమార్క రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని సిఎం కెసిఆర్ అన్నారు.

Also Read : తెలంగాణ‌పై కేంద్రం వివ‌క్ష‌..భ‌ట్టి విక్ర‌మార్క ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్