Saturday, November 23, 2024
HomeTrending Newsదేశానికే చైతన్య గీతిక కావాలి: సిఎం కెసిఆర్

దేశానికే చైతన్య గీతిక కావాలి: సిఎం కెసిఆర్

సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతి, సహనం, సర్వజనుల సంక్షేమం కాంక్షించి ముందుకు వెళ్లాలని, అంతే తప్ప మత పిచ్చి, కులపిచ్చి, ప్రజలను చీలదీసే పద్ధతులు అవలంబిస్తే మన దేశం కూడా ఒక నరకం లాగా, తాలిబాన్ లాగా, ఆఫ్ఘన్ లాగా తయారవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. కురవి వీరభద్రుడి దయ, మానుకోట రాళ్ళ బలం వల్ల ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీకృత నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసిఆర్ ప్రసంగించారు.

తెలంగాణ మంచి అభివృద్ధి దశలో ఉందని, రాష్ట్రం ఏర్పడకముందు కేవలం నాలుగే మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ఇప్పుడు 33 కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. మహబూబాబాద్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మహబూబాబాద్ జిల్లాలో గతంలో 461 గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఉన్నాయని, వీటిలో ప్రత్యేక రాష్ట్ర వచ్చిన తరువాత 283 ఏర్పాటు చేసినవేనని అన్నారు.  జిల్లాకు సంబంధించిన ప్రతి పంచాయతీకి పది లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సిఎం కేసిఆర్ ప్రకటించారు. ఈ నిధులపై పూర్తి అధికారం సర్పంచ్ లేక్ ఇస్తున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ అభివృద్ధికి 50 కోట్లు, జిల్లా పరిధిలోని మిగిలిన  మున్సిపాలిటీలకు 25 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

నూకల రామచంద్రారెడ్డి లాంటి ఓ మహానుభావుడు పుట్టిన గడ్డ మహబూబాబాద్ గడ్డ అని, అయన తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తీ అని, పివి నరసింహారావుకు గురువు రామచంద్రారెడ్డి అని కొనియాడారు. పివికి కూడా ఇస్తేనే తాను మంత్రి పదవి స్వీకరిస్తానని చెప్పిన వ్యక్తీ అని, పివికి మంచి భవిష్యత్తు ఉందని ఎప్పుడో గ్రహించారని ప్రశంసించారు. సమైఖ్య రాష్టంలో తెలంగాణ తేజాలను పట్టించుకోలేదని,  రాబోయే రోజుల్లో రామచంద్రారెడ్డి పేరుమీద ఓ సంస్థను నెలకొల్పుతామని ప్రకటించారు.  భవిష్యత్ రాజకీయాల్లో భారత దేశానికే ఓ మార్గం చూపే అద్భుతమైన చైతన్య గీతిక తెలంగాణ నుంచే వీయాలని, అందులో ప్రజలంతా భాగాస్వామ్యులు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్