జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్ ను మంత్రి సందర్శించారు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ యాసిన్ బాష మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు భక్తులను ఆలయ సందర్శన నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. మంత్రి
వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవికుమార్, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జిల్లా ఎస్పీ భాస్కర్, కొండగట్టు ఆలయ ఈఓ వెంకటేష్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొండగట్టు అనుకోని అటవీ ప్రాంతాలు ఉండటంతో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. విపక్షాలు నిరసన తెలుపుతారనే సమాచారం రావటంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.