Sunday, November 24, 2024
HomeTrending NewsRagi Malt: మనంకాకపొతే ఇంకెవరు : సిఎం జగన్

Ragi Malt: మనంకాకపొతే ఇంకెవరు : సిఎం జగన్

గోరుముద్దను మరింత మెరుగ్గా అందించడానికే చేయడానికే స్కూలు పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పిల్లల్లో ఐరన్‌, కాల్షియం పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38లక్షల మంది పిల్లలకు ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. జగనన్న గోరుముద్ద కింద రాగిజావ అందించే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ లాంఛనంగా  ప్రారంభించారు.

సిఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

  • గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నాం
  • మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనించండి
  • మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి, ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి
  • సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టేవారు
  • ఇలా బకాయిల పెడితే… క్వాలిటీ అనేది ఉండదు
  • గోరు ముద్దద్వారా ప్రతిష్ట్మాతకంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం
  • ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం
  • రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నాం
  • ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటూ ఉన్నారు అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు
  • పిల్లలకు మంచి మేనమామలా … ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం
  • మనం చేయకపోతే.. ఇంకెవరు చేస్తారన్న దానితోనే గోరుముద్దను చేపట్టాం
  • మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు అందిస్తున్నాం, వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నాం, మూడు రోజులు చిక్కి ఇస్తున్నాం
  • మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇప్పుడు ఇస్తున్నాం
  • ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం సంతోషకరం
  • శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నాను
  • ఏడాదికి రూ.84 కోట్లు రాగిజావ కోసం ఖర్చు చేస్తున్నాం, దీంతో గోరుముద్దకోసం చేస్తున్న ఖర్చు రూ.1910 కోట్లకుపైగా ఖర్చు అవుతుంది

పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఆల్‌ ది వెరీ బెస్ట్‌ తెలియజేశారు సిఎం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్