Monday, January 27, 2025
HomeTrending NewsBandar Port: మంచి చేసిన చరిత్ర బాబుకు లేదు: సిఎం జగన్

Bandar Port: మంచి చేసిన చరిత్ర బాబుకు లేదు: సిఎం జగన్

రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక చంద్రబాబు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లు కూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మంది సొంతింటి కల సాకారం చేస్తుంటే.. ఇలాంటి పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోల్చడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెంటు స్థలం శవం పూడ్చాదానికా అంటూ విశాఖలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. ఏనాడూ పేదలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు మానవత్వం లేదని, కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేకపొతే, తాము వారికి నిర్మించి ఇస్తుంటే ఇలాంటి కార్యక్రమాన్ని దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అని అభివర్ణించారు.

అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని… సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించారని విమర్శించారు.  తన పరిపాలనా కాలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని చంద్రబాబు తమ ప్రభుత్వం 31 లక్షల పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తుంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో  బందరు పోర్టు నిర్మాణ పనులను లాంఛనంగా సిఎం ప్రారంభించారు. సముద్రం వద్ద పూజలు నిర్వహించి, సమీపంలో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం భారత్ స్కౌట్స్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగసభలో  ఆయన ప్రసంగించారు. బాబుకు పేదలంటే చులకన అని, గతంలో కూడా ఎస్సీలు, బిసిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

బందరు పోర్ట్ పై సిఎం ప్రసంగంలో పేర్కొన్న ముఖ్యాంశాలు:

  • కృష్ణా జిల్లా చరిత్రను ఈ పోర్టు మారుస్తుంది,  రాష్ట్రం మాత్రమే కాకుండా, ఇక్కడి వ్యాపారంతో పక్క  రాష్ట్రాలు.. ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ ఉపయోగం
  • పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి
  • పోర్టు ఇక్కడ రాకూడదని తపన, తాపత్రయ పడ్డాడు చంద్రబాబు:
  • 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా చంద్రబాబు చేశాడు, దీనివల్ల పోర్టు అడగరని అనుకున్నారు.
  • ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే.. అందరూ అమరావతిలో తాను బినామీగా పెట్టుకున్న భూములను విపరీతంగా అమ్ముకోవచ్చని తీరని ద్రోహం చేశాడు

  • పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం
  • ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పాను
  • రైతులందరి సంతోషం మధ్య ఆ భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం
  • ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నాం
  • 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి
  • ఏ సమయంలో నైనా మత్స్యసంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ పనులు కూడా జరుగుతున్నాయి, 60శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి:
  • నాలుగు నెలల్లో ఇదికూడా అందుబాటులోకి వస్తోంది

  • రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి మన ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది:
  • 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 2025-2026 నాటికి అదనంగామరో 110 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నాం
  • మరో మూడు నెలల్లో బందరు మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి
  • అవనిగడ్డ, పెడన, పామర్రు, కైకలూరు ప్రాంతాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్