Sunday, January 19, 2025
HomeTrending Newsగవర్నర్ తో సిఎం భేటీ

గవర్నర్ తో సిఎం భేటీ

Governor-CM: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైఎస్ జగన్, భారతి దంపతులు గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సిఎం జగన్ ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలతో పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా పదిరోజుల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. అనంతరం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా. నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలుసుకున్నారు.

గవర్నర్ కు తన పర్యటన విశేషాలను సిఎం వివరించి ఉంటారని తెలుస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం :గవర్నర్ ప్రశంస

RELATED ARTICLES

Most Popular

న్యూస్