Sunday, February 23, 2025
HomeTrending Newsఅధికార లాంఛనాలతో సీతామహాలక్ష్మి అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో సీతామహాలక్ష్మి అంత్యక్రియలు

జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార అధికార లాంఛనాలతో  నిర్వహించాలని సీఎం  వైఎస్.జగన్  మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

శ్రీమతి ఘంటసాల సీతామహాలక్ష్మి నిన్న మాచర్లలోని స్వగృహంలో  అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయస్సు సుమారు 100 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె వృద్దాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాచర్లలోని తన కుమారుడు నరసింహం ఇంటిలో నివశిస్తున్న ఆమె నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో  కాలం చేశారు.  భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలలో భాగంగా గత ఏడాది సిఎం జగన్ మాచర్లలో వారి ఇంటికి స్వయంగా వెళ్లి ఆమెను సత్కరించి ఒక కోటి రూపాయల బహుమానం అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్