Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

 Relief Programs In Flood Affected Areas :

వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతోఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు. పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రూ.2వేల రూపాయల అదనపు సహాయం పంపిణీ, నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి నష్టపరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సమీక్షించిన సీఎం.

ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా కూడా సమాచారం అడిగితెలుసుకున్న సీఎం. అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తయినకొద్దీ… వెంటనే సోషల్‌ఆడిట్‌ కూడా నిర్వహించాలన్నారు.  పూర్తిగా ధ్వసంమైన ఇళ్ల స్థానే కొత్త ఇళ్లను మంజూరుచేయాలి. వెంటనే పనులుకూడా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లులేని వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని, తాత్కాలిక వసతిలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. మళ్లీ నివాస వసతి ఏర్పడేంతవరకూ కూడా వారిని జాగ్రత్తగా తీసుకోవాలి. చెరవులు గండ్లు పడకుండా జాగ్రత్త తీసుకోవాలని, చెరువుకు, చెరువుకు మధ్య అనుసంధానం ఉండాలన్నారు. చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండాలి, భవిష్యత్తులో దీనిపై దృష్టిపెట్టండన్నారు.

తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టండని, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి నెలకొందని, చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులుకూడా గండ్లు పడ్డాయన్నారు. వీటి మీద ఆధారపడ్డ పట్టణాల్లో, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని బలమైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి కూడా అదనపు సహాయం రూ.2వేలు అందాలని, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలని అధికారులను సిఎం ప్రత్యేకంగా కోరారు.  ఆర్బీకేల ద్వారా విత్తనాలను పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశామని, ఆర్బీకేల్లో విత్తనాలు ఉంచామన్నారు.

ఆ పెద్ద మునిషివి బురద రాజకీయాలు: సీఎం

వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేగంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదని, గతంలో కనీసం నెల పట్టేదని సిఎం తెలిపారు. ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు సహాయాన్ని అందించగలిగామన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని, గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదని, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదన్నారు. గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని, అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నామని,రేషన్, నిత్యావసరాలు ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామన్నారు.

గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదని, సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి..సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని, గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేదని సిఎం వెల్లడించారు. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే మనం అందిస్తున్నామని, రూ.6వేల కోట్లు నష్టం జరిగితే … ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారని అన్నారు. జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా,  30శాతానికిపైగా పంటరూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగిందిని, హుద్‌హుద్‌లో రూ.22వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ఇచ్చింది రూ.550 కోట్లు అయితే అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. రూ.22వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన పెద్ద మనిషి ఇచ్చింది రూ.550 కోట్లు అని గుర్తు చేసిన సిఎం జగన్ మోహన్ రెడ్డి  కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైన కూడా బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

Also Read : షో చేయాల్సిన అవసరం లేదు: బొత్స

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com