Saturday, November 23, 2024
HomeTrending Newsఅపాచీ పరిశ్రమకు నేడే శంఖుస్థాపన

అపాచీ పరిశ్రమకు నేడే శంఖుస్థాపన

Foundation: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  గురువారం నాడు భూమి పూజ చేయనున్నారు. 800 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ ద్వారా సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది.  దాదాపు 290 ఎకరాల్లో ఫుట్‌వేర్‌ సెజ్‌ను అపాచీతో కలిసి ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అపాచీ ఇప్పటికే రాష్ట్రంలో ఒక యూనిట్‌ ఏర్పాటు చేసిందని, దాని ద్వారా 15 వేల మందికి ఉపాథి లభిస్తోందని, ఇప్పుడు ఈ యూనిట్‌ ద్వారా మరో 10 వేల మందికి ఉపాధి వస్తుందని తెలిపారు.

దీంతో పాటు తిరుపతి విమానాశ్రయం పక్కనే ఉన్న రెండు ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో టీసీఎల్, సన్నీ ఒపోటెక్, డిక్సన్, ఫాక్స్‌లింక్స్‌.. కంపెనీలను కూడా సిఎం జగన్ ప్రారంభిస్తారని, ఈ పరిశ్రమలు  సుమారు రూ.2900 కోట్లతో ఏర్పాటవుతున్నాయని, 15 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

2019లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో ఏకంగా రూ. 11,500 కోట్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటయ్యాయని,  దాదాపు 60 వేలకు పైగా మందికి ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటయ్యాయని, వాటి ద్వారా 28 వేల మందికి పైగా ఉపాధి లభిస్తోందని… భవిష్యత్తులో అన్ని పరిశ్రమలతో పాటు, ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లను కూడా మరింతగా అభివృద్ధి చేయబోతున్నామని అమర్నాథ్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్