Wednesday, May 7, 2025
HomeTrending NewsEnergy: మూడు విద్యుత్ ప్రాజెక్టులకు నేడు భూమిపూజ

Energy: మూడు విద్యుత్ ప్రాజెక్టులకు నేడు భూమిపూజ

రాయలసీమలో మూడు పునరుత్పాదక ఇంధన  ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.  నంద్యాల జిల్లాలో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 5314 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. దీనిలో 4 వేల మెగావాట్లు సోలార్, 1314 మెగావాట్లు పవన్ విద్యుత్.  సిఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేయనున్నారు.

  • అవుకు మండలం జునూతల గ్రామం వద్ద  గ్రీన్‌కో సహకారంతో 2300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్
  • పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం  వద్ద  ఏఎం గ్రీన్‌ ఎనర్జీతో 1014 మెగావాట్లు
    (700 మెగావాట్ల సోలార్‌, 314 మెగావాట్లు),
  • నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మండలం  ముద్దవరం గ్రామంలో  ఎకోరెన్ ఎనర్జీ ద్వారా 2000 మెగావాట్లు (1000 సోలార్‌, 1000 పవన)   ఏర్పాటు చేస్తున్నట్లు

ఈ సందర్భంగా పంప్డ్ స్టోరేజీ పవర్ (PSP) ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (NHPC) తో ఏపీ జెన్కో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.  గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడి అవకాశాలపై  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  కుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను ఏపీ జెన్కో ఎండీ కెవీఎన్ చక్రధర్ బాబు సమీక్షించారు.

ప్రపంచ స్థాయి  ప్రమాణాలకు అనుగుణంగా  24×7  నాణ్యమైన , నిరంతర విద్యుత్ సరఫరాను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం  ముందుకువెళ్తోందని చక్రధర్ బాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.   ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు  ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా, పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు  సహాయపడతాయని తెలిపారు . పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు పొందుతోందని,  తద్వారా ప్రజల ఆర్థిక,  జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు చౌక విద్యుత్ ను ప్రతి కుటుంబానికి అందించడమే  ప్రభుత్వ లక్ష్యమని  ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్