Sunday, January 19, 2025
HomeTrending Newsవరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, శుక్రవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై ఇప్పటికే సిఎం జగన్ సమీక్ష నిర్వహించి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇరిగేషన్‌ రివ్యూ సందర్భంగా గోదావరికి వస్తున్న వరదలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం

రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపిన అధికారులు

తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించిన అధికారులు

దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.

సిఎం సూచనలు:

పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలి

వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్