Saturday, January 18, 2025
Homeసినిమా'బాక్'లో భయపెట్టిన కామెడీ!

‘బాక్’లో భయపెట్టిన కామెడీ!

సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలకు కాస్త కామెడీని జోడిస్తూ ఉంటారు. సీరియస్ గా సాగే హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఎక్కువమంది ఇష్టపడరు. అలాంటి కంటెంట్ ను చూడటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. భయానికి కాస్త కామెడీని మిక్స్ చేస్తే, అప్పుడది ఫ్యామిలీ ఆడియన్స్ జోనర్ కి దగ్గరగా వెళుతుంది. అందువలన హారర్ కామెడీ కథల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతూ ఉంటారు. ‘కాంచన’ సిరీస్ నుంచి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

లారెన్స్ ‘కాంచన’ సిరీస్ ను హారర్ కామెడీ జోనర్లో నడిపిస్తే, సుందర్ సి అదే జోనర్లో ‘అరణ్మనై’ సిరీస్ ను పరిగెత్తిస్తున్నాడు. అలా ఆయన వదిలిన ‘అరణ్మనై 4’ సినిమాను, తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజ్ చేశారు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను నిన్ననే రిలీజ్ చేశారు. సుందర్ .. తమన్నా .. రాశి  ఖన్నా వైపు నుంచి ఈ కథలో భయానకమైన సన్నివేశాలు సాగుతూ ఉంటాయి. ఇక వెన్నెల కిశోర్ – శ్రీనివాస రెడ్డితో కామెడీ ట్రాక్ ను అల్లుకున్నారు. ఈ కామెడీ ట్రాక్ నే ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.

ఇప్పుడు కామెడీ తన రూట్ మార్చుకుంది. కొత్త తరహాలో అది తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. టీవీల్లో కొన్ని పాప్యులర్ కామెడీ షోలు సక్సెస్ అయిన తరువాత, ఎవరికి వారు తమ సినిమాలో కామెడీ స్థాయి నెక్స్ట్ లెవెల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కామెడీ కన్నా, ఫలానా షోలో వచ్చే ఆ స్కిట్స్ బెటర్ అనేస్తున్నారు. అందువలన కామెడీని ట్రాక్ ను అల్లుకోవడం ఇప్పుడు కష్టతరమైన పనిగా మారింది. కానీ ఈ సినిమాలో కామెడీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. పేలవమైన కామెడీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్