2022 కామన్ వెల్త్ గేమ్స్ బర్మింగ్ హామ్ లోని అలెగ్జాండర్ స్టేడియంలో అత్యంత వైభవంగా మొదలయ్యాయి. ఆరంభ వేడుక క్రీడాకారులు, అతిథులు, ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గత కామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఆరుగులు క్రీడాకారులు మూడు రంగుల జెండాను వేదికపైకి తీసుకు వచ్చారు. ఎరుపు, పసుపు, నీలం రంగులతో కూడిన ఈ పతాకం మానవత్వం, లక్ష్యం, సమానత్వం అనే నినాదాలను విస్తరించే లక్ష్యంతో రూపొందించారు. ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్ పంపిన సందేశాన్ని ప్రిన్స్ చార్లెస్ చదివి వినిపించి క్రీడలు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు.
భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందానికి తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ లు నాయకత్వం వహించారు. 19 క్రీడాంశాలలో 141 విభాగాల్లో మొత్తం 215 మంది భారత క్రీడాకారులు తమ సత్తా ప్రదర్శించేందుకు సమాయత్తమయ్యారు.
అన్ని ఈవెంట్లలో కలిపి 170 బంగారు పతకాలు ఉండగా మహిళలకు 136, పురుషులకు 134 కేటాయించారు. 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా 66 పతకాలు సాధించగా, అత్యుత్తమంగా ఢిల్లీ లో జరిగిన 2010 గేమ్స్ లో 38 గోల్డ్ మెడల్స్ తో పాటు మొత్తం 101 పతకాలు సాధించి కామన్ వెల్త్ గేమ్స్ లో తమ అత్యుత్తమ ప్రదర్శన చాటింది.
Also Read : Commonwealth Games: కోవిడ్ జాగ్రత్తలు పాటించండి