Sunday, September 8, 2024
HomeTrending NewsFree Power patent: సత్యాగ్రహ దీక్ష నీరుగార్చే కుట్ర - రేవంత్ రెడ్డి

Free Power patent: సత్యాగ్రహ దీక్ష నీరుగార్చే కుట్ర – రేవంత్ రెడ్డి

దేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతోన్న రాహుల్ గాంధీ గారి పై మోడీ ప్రభుత్వం కక్షగట్టి ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రేపు (బుధవారం) టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా “సత్యాగ్రహ దీక్ష” పేరుతో గాంధీజీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమైన సందర్భంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెర మీదకు తెచ్చి బీఆర్ఎస్ చిల్లర హడావుడి చేయడం, సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఈ B టీం బంధం ఫెవికాల్ బంధంగా బలపడిందని రేవంత్ ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా జరుగుతోన్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసే కుట్రలో భాగంగా బీజేపీ B టీం అయిన బీఆర్ఎస్ అమెరికాలో తాను అనని మాటలను అన్నట్టు దుష్ర్ఫచారంలోకి తెచ్చి మోడీని కాపాడే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్న విషయం తేలిపోవడంతో బీఆర్ఎస్ మంత్రులు, నేతలు దుష్ప్రచారాలకు తెగబడ్డారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం, ఈ డిక్లరేషన్ రైతుల్లో భరోసా నింపడంతో వెన్నులో వణుకుపుట్టిన బీఆర్ఎస్ చిల్లర ప్రచారాలతో లబ్ధిపొందే కుతంత్రానికి దిగిందన్నారు.
బీఆర్ఎస్ సర్కారు రైతులకు12 గంటలు కూడా నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని… 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు రైతులను మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ రోజు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాల్సిందిగా శ్రేణులుకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలకు రూ.60 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అవినీతితో వాటిని దివాళా తీయించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. దీనిపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమని… కేసీఆర్ అండ్ కో కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు.

అమెరికాలో తాను మాట్లాడిన మాటలపై కోడిగుడ్డు పై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్ అన్నది కాంగ్రెస్ పేటెంట్ స్కీం. 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో రైతులను మోసం చేస్తోన్న కేసీఆర్ అండ్ కోకు కాంగ్రెస్ ను వేలెత్తి చూపించే అర్హత లేదని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ మంత్రులు, నాయకుల చిల్లర ప్రయత్నాలకు ఒక మీడియా చానెల్ వత్తాసు పలకడం, వారితో అంటకాగి తమ పై దుష్ర్పచారం చేయడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పాటు ఆ ఛానెల్ బాగోతం ఏమిటన్నది కూడా బయటపెడతానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్